రెండో దపా జగన్ మొదటిరోజు సీబీఐ విచారణ పూర్తయింది. నేడు జగన్ ను సిబిఐ విదేశి పెట్టుబడులు పైన విచారించినట్టు తెలుస్తుంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉదయం పదిన్నరకు చంచల్‌గూడ జైలు నుంచి జగన్‌ను సీబీఐ తమ కస్టడీకి తీసుకుంది. బులెట్‌ప్రూఫ్ వాహనంలో జగన్‌ను కోఠిలోని సీబీఐ ఆఫీసుకు తరలించారు. జగన్ తరఫు లాయర్ల సమక్షంలో అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో ప్రధానంగా విదేశీ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన్నట్టు తెలుస్తోంది. అలాగే, జగన్ విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు, ఆయన కంపెనీల్లో విదేశీ సంస్థలు పెట్టిన పెట్టుబడులపై సీబీఐ అధికారులు విచారించిన్నట్టు సమాచారం. కాగా, జగన్‌ను ఇప్పటికే ఐదు రోజుల పాటు సీబీఐ విచారణ జరిపిన విషయం తెల్సిందే.