Jun-06-2012 03:44:10 | |
న్యూఢిల్లీ : ఎయిరిండియాలో ఫైలెట్ల సమ్మె 30 రోజులవుతోంది. కానీ సమ్మె సమాప్తమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఫైట్లు, ఎయిర్ ఇండియా యాజమాన్యం...ఎవరూ తమ పంతం వీడడం లేదు. సమ్మె చేస్తున్న ఫైలట్లు బేషరతుగా విధులకు హాజరు కావాలని పౌర విమాన యాన శాఖ మంత్రి అజిత్‌సింగ్ పేర్కొన్నారు. విధుల నుంచి తొలగించిన ఫైలట్లు మళ్లీ విధుల్లోకి రావాలంటే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ధర్మాధికారి నివేదికను అమలు చేయబోతున్నామని, అది ఇష్టం లేని ఫైలట్లు రానక్కరలేదని కూడా ఆయన పేర్కొన్నారు. మరికొంతమంది ఫైలట్లను తొలగించే ఉద్దేశాన్ని ప్రకటించిన మంత్రి కొత్త ఫైలట్లను ఉద్యోగంలోకి తీసుకుంటున్నామన్నారు. 3,4 నెలల్లో వారు విధుల్లో చేరుతారని చెప్పారు. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరిస్తారన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఇండియన్ ఫైలట్ల్సు గిల్డ్‌కి చెందిన ఫైలట్లు ఈరోజు ఢిల్లీ, ముంబైలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సమ్మె కారణంగా ఎయిరిండియాకు ఇప్పటి వరకు రూ. 350 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
|
Source: http://www.andhrayouth.com/telugu/view_news.php?id=24239&typ=news