Jun-05-2012 11:59:15 | |
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దోచుకోవడమే అజెండాగా ముందుకెళ్లినందుకే జైలు ఊచలు లెక్కపెడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులామ్ నబీ ఆజాద్ విమర్శించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు చిరంజీవితో కలిసి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో రోడ్‌షో, అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తొలుత ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి, ఆళ్లగడ్డలో రోడ్‌షోలో జగన్ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మూడు నెలలు మాత్రమే ఎంపీగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి సిఎం పదవి ఎలా వస్తుందని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్నారని విమర్శించారు. దాని ఫలితంగా ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారన్నారు.
Source:http://www.andhrayouth.com/telugu/view_news.php?id=24231&typ=news |