NEWS

Blogger Widgets

6.6.12


దిల్‌ రాజు నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకీ, మహేష్‌బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. లక్ష్మీ తరహాలో కుటుంబకథా చిత్రంగా దీన్ని తీసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి రామయాణంలోని రామలక్ష్మణుల కథను ఇతివృత్తంగా తీసుకుని రచయిత - దర్శకుడు శ్రీకాంత్‌ మలిచాడని తెలిసింది. 

వెంకీ, మహేష్‌ అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాలో తండ్రి మాట ప్రకారం మరదల్ని పెండ్లి చేసుకుంటాడు వెంకీ. కానీ మహేష్‌ కోటీశ్వరాలైన యువతిని ప్రేమిస్తాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో గొడవలు రావడం... ఆఖరికి అన్నదమ్ములు విడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత తనెవరో మహేష్‌ తెలుసుకుని వెంకీ దగ్గరకు రావడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ మధ్యలోజరిగే డ్రామానే సినిమా. 

ఈ కథ గురించి దిల్‌ రాజు చెబుతూ.. మీరు ఎలా అనుకుంటే అలాగ రాసుకోండి. కథ మాత్రం రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ముల కథ అని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఫిలింసిటీలో వేసిన సెట్లో మహేశ్‌బాబుపై సన్నివేశాల చిత్రీకరిస్తున్నారు. ఇందులో "జర్నీ" ఫేమ్ అంజలి నటిస్తోంది. ఇప్పటికే ఈమె చక్కటి తెలుగింటి అమ్మాయిలా పేరు కొట్టేసింది.