NEWS

Blogger Widgets

6.6.12

మీడియాతో మాట్లాడాలని కోరుతున్న జగన్



ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తనను మీడియాతో మాట్లాడనివ్వాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కోర్టును కోరారు.అయితే ఇది కొత్త ట్రెండ్ అవుతుంది. గతంలో ఎన్నడూ ఇలా ఒక విచారణలో ఖైదీ కోర్టును ఈ విషయంలో అభ్యర్దన చేసిన ధాఖలాలు లేవు. అయితే విచారణ నిమిత్తం జైలు నుంచి కోర్టుకు వెళ్లే సమయంలో టీవీ ఛానళ్లు తమ మైక్ లు పెడితే పోలీసులు వారించినా మాట్లాడుతుండడం జరుగుతుంటుంది. అయితే జగన్ ఒక ఎమ్.పిగా ఉండి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున అలా చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో జగన్ కోర్టును కోరిన సందర్భం విశేషంగానే కనిపిస్తుంది. అయితే కోర్టు ఎంతవరకు మీడియాతో మాట్లాడే అవకాశం కల్పిస్తుందన్నది సందేహమే.ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తన వాణిని వినిపించే అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.