NEWS

Blogger Widgets

6.6.12

చంద్రబాబుకు మించిన అవినీతి పరుడు లేడు: లక్ష్మీపార్వతి



తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మించిన అవినీతి పరుడు దేశంలో ఇంకెవ్వరూ లేదని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆరోపించారు. అవినీతి కేసులతో దొంగైన చంద్రబాబు దర్జాగా తిరుగుతున్నా అధికారులు సాక్ష్యాలు లేవంటూ చేతులెత్తాశరని లక్ష్మీ పార్వతీ ధ్వజమెత్తారు. 

తన కేసులపై విచారణ లేకుండా పోలీసులను, కోర్టులను కూడా అడ్డుకోగల సామర్థ్యం చంద్రబాబుకు ఉందని లక్ష్మీ పార్వతీ విమర్శించారు. బుధవారం లక్ష్మీపార్వతి రాయదుర్గంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బినామీల పేరుతో చంద్రబాబు వేలకోట్లు సంపాదించారన్నారు. బాబు అక్రమాస్తులపై అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.