బుదవారం, జూన్ 6, 2012, 11:34 [IST]
హైదరాబాద్: సుదీర్ష కాలం తర్వాత ఏర్పడిన శుక్రగ్రహ అంతర్యానం (వీనస్ ట్రాన్సిట్)పై రాష్ట్ర ప్రజలు విశేష ఆసక్తి కనబరిచారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజా, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రాష్ట్ర సాంకేతిక మండలి, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాట్లు చేశాయి. సూర్యుడికి, భూమికి మధ్య శుక్రగ్రహం మెల్లగా కదులుతూ నల్లని మచ్చలా ఆకాశంలో కనిపించింది. హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి ప్రాంతాల్లో ప్రజలు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా చూశారు.

రాష్ట్రంలో ఉదయం 5 గంటల 42 నిమిషాల నుంచి 10 గంటల 22 నిమిషాల మధ్య సోలార్ ఫిల్టర్ల సహాయంతో ఈ దృశ్యాన్ని చూసేందుకు వీలుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రజలు నేరుగా ఈ దృశ్యాన్ని చూడవద్దని వారు సూచించారు. శుక్రగ్రహ అంతర్యానం నాలుగు దశల్లో జరుగుతుంది. ఇన్‌గ్రెస్ ఎక్స్‌టీరియర్ (అంటే శుక్రుడు సూర్యుడి అంచులను తాకే దశ), ఇన్‌గ్రెస్ ఇంటీరియర్ (సూర్యుడిపై శుక్రుడు ఒక మూలన నల్లటి చుక్కలాగా కనిపిస్తాడు), ఎక్స్‌గ్రెస్ ఇంటీరియర్ (శుక్రుడు సూర్యుడిని దాటిపోయే దశ), ఎక్స్‌గ్రెస్ ఎక్స్‌టీరియర్ (శుక్ర అంతర్యానం ముగింపు దశ). ఈ నాలుగు దశలకు సరిగ్గా మధ్యలో ఉండే సమయం సెంటర్ ట్రాన్సిట్.
వాయవ్య అమెరికా, పశ్చిమ పసిఫిక్, ఉత్తర ఆసియా, జపాన్, కొరియా, తూర్పు చైనా, ఫిలిప్పీన్స్, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర చోట్ల నుంచి పూర్తి ట్రాన్సిట్‌ను వీక్షించగలం. మొత్తమ్మీద ఈ ట్రాన్సిట్‌లో శుక్రుడికి సూర్యుడి మీదుగా ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రయాణించడానికి పట్టే సమయం దాదాపుగా ఏడుగంటలు. అంతర్యాన సమయంలో శుక్రుడు సూర్యుడి మీద ఒక చిన్న మచ్చలాగా కనపడతాడు. మామూలుగా మనకు కనిపించే సూర్యుడి పరిమాణంలో 1/32 వ వంతు పరిమాణంలో నల్లగా శుక్రుడు దర్శనమిస్తాడు.
సూర్యగ్రహణాన్ని చూసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో శుక్ర అంతర్యానాన్నీ అంతే జాగ్రత్తగా వీక్షించాల్సి ఉంటుంది. సాధారణ కంటితో ఈ దృశ్యాన్ని వీక్షి స్తే చూపు దెబ్బ తినే ప్రమాదం ఉంది. వెల్డింగ్ చేసేటప్పు డు వినియోగించే 14 గేజ్ అద్దాలనుగానీ, సోలార్ ఫిల్టర్లను గానీ, గ్రహణాలను తిలకించేందుకు వినియోగించే ప్రత్యేక సోలార్ అద్దాలను గానీ ఉపయోగించి మాత్రమే ఈ వింతను చూడాల్సి ఉంటుంది.
టెలిస్కోపును కనుగొన్నాక సంభవించిన ఎనిమిదో వీనస్ ట్రాన్సిట్ ఇది. గతంలో.. 1631, 1639, 1761, 1769, 1874,1882 సంవత్సరాల్లో శుక్ర అంతర్యానం జరిగింది. 1882 నుంచి 121.5 ఏళ్ల తర్వాత 2004 జూన్ 8న సంభవించింది. ఈ అరుదైన వింత 8, 121.5, 8, 105.5, 8 ఏళ్ల విరామాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు.. 2004, జూన్ 8న వీనస్ ట్రాన్సిట్ సంభవించింది.
మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు సాక్షాత్కరించింది. తదుపరి ఇదే దృశ్యం కనిపించాలంటే 105.5 ఏళ్లు ఆగాలి. అంటే, 2117లో వీనస్ ట్రాన్సిట్ వస్తుంది. అక్కణ్నుంచి మళ్లీ ఎనిమిదేళ్ల గ్యాప్‌తో.. 2125లో దర్శనమిస్తుంది. ఆ తర్వాత మరో ట్రాన్సిట్ చూడాలంటే 121.5 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది.