Jun-03-2012 08:32:54 | |
హీరోయిన్ హన్సిక ఖరీదైన బిఎండబ్ల్యు కారును కొనుగోలు చేసింది. ‘స్వాంకీ బిఎండబ్ల్యు సిరీస్ 5 సెడెన్’ మోడల్ తీసుకున్న ఆమె ఈ కారు కోసం దాదాపుగా రూ. 50 నుంచి 70 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. తన కిష్టమైన నేవీ బ్లూకలర్ ఎంపిక చేసుకున్న హన్సిక ఈ కారు కోసం తన లక్కీ నెం.9ని కూడా పొందింది.ఈ విషయమై హన్సిక తన ట్విట్టర్లో పేర్కొంటూ...‘మా అమ్మ, బ్రదర్‌తో కలిసి ఈ కారులో ఫస్ట్ డ్రైవ్ చేశాం. చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా నా లక్కీ నెం. 9 కూడా ఈ కారు నెంబర్‌గా లభించడం మరింత సంతోషంగా ఉంది, ఇటీవల నేను కొనుగోలు చేసిన ఫ్లాట్ నెంబర్ కూడా 9’ అంటూ హన్సిక చెప్పుకొచ్చింది.
Source:http://www.andhrayouth.com/telugu/view_news.php?id=24192&typ=gossips |