NEWS

Blogger Widgets

6.6.12

హైకోర్టులో జగన్‌ రిట్‌పిటీషన్‌ దాఖలు



Jun-06-2012 06:01:26
హైదరాబాద్‌ : హైకోర్టులో జగన్‌ రిట్‌పిటీషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తమ వాణి వినిపించుకునే అవకాశం ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రజల్లో తమ వాణిని వినిపించుకునే అవకాశం ఇవ్వాలన్నారు. రాజ్యాంగ అధికరణ19(1) ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని ఆయన తెలిపారు. అండర్‌ ట్రయల్‌గా ఉన్న తనకు మీడియాతో మాట్లాడే అవకాశం కలిపించాలని జగన్‌ కోరారు. జైళ్ల డీజీ, ఐజీ, డీఐజీలను ప్రతివాదులుగా చేర్చారు.


Source:http://www.andhrayouth.com/telugu/view_news.php?id=24242&typ=news