NEWS

Blogger Widgets

6.6.12

'గబ్బర్‌సింగ్‌'లో నా వాటా



Jun-03-2012 08:31:25
గబ్బర్‌సింగ్‌ విజయం సమష్టి కృషి ఫలితం. అందులో నా వాటా కాస్త ఉందంతే'' అని చెప్పుకొచ్చింది శ్రుతి. గబ్బర్ సింగ్ హిట్ట్ తో ఐరన్ లెగ్ అనే ముద్రను పోగొట్టుకున్న శృతిహాసన్ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే ప్లాప్ లుకు తాను ఎప్పుడూ భయపడను..పట్టించుకోను అంది. హిట్,ప్లాప్ లతో ప్రతిభను లెక్కగడతారని నేనెప్పుడూ అనుకోను. అందుకే ఆ రెండు పదాలకు నా నిఘంటువులో చోటుండదు అని చెబుతోంది శ్రుతిహాసన్‌.

అలాగే... పవన్‌కళ్యాణ్‌కి సరిజోడీ నేనే...పవర్‌స్టార్ పెరఫార్మెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎంతో స్టైలిష్‌గా నటిస్తారు.అసలు షూటింగ్ టైమ్‌లో మా ఇద్దరి పెయిర్ బాగుందని, మా ఇద్దరి మధ్య చక్కని కెమిస్ట్రీ కుదిరిందని యూనిట్ సభ్యులు అంటుంటే చాలా సంతోషం అనిపించేది. డాన్సుల పరంగా కూడా పవన్‌కి గట్టిపోటీ ఇవ్వాలని బాగా ప్రాక్టీస్ చేసి, డాన్సులు చేశా. ఈ సినిమా విడుదలయ్యాక పవన్‌కి సరైన జోడీ శ్రుతిహాసనే అందరూ అంటూంటే ఆనందం వేసింది అంది శ్రుతిహాసన్.

Source:http://www.andhrayouth.com/telugu/view_news.php?id=24191&typ=gossips