NEWS

Blogger Widgets

6.6.12

చిరు మాకొద్దు...!



May-31-2012 10:13:08
ఉప ఎన్నికల్లో మెగాస్టార్‌ చిరంజీవి ప్రచారంను ఉపయోగించుకోవాలన్న కాంగ్రెస్‌ నాయకత్వం ఆలోచనకు భిన్నంగా కింది స్థాయి నేతల్లో భావనలు వ్యక్తమవుతున్నాయి.సినీనటుడిగా రాష్ట్రంలోని ఓట్లను ప్రభావితం చేయగలుగుతారన్న భావనతో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. 2009 ఎన్నికల్లో పిఆర్‌పి మెజార్టీ సీట్లు సాధించకపోయినా పదినిమిది శాతం ఓట్లను ఆ పార్టీ సాధించింది. పిఆర్‌పి విలీనంతో ఆ ఓట్లు మొత్తంగా కాకపోయినా మెజారిటీగానైనా తమకు కలిసొస్తుందని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికల ప్రచారంలో చిరంజీవికి కూడా ప్రచార బాధ్యతలను అప్పగించారు. ఉప ఎన్నికలు జరిగే మెజార్టీ స్థానాల్లో ఆయన పర్యటన షెడ్యూల్‌ కూడా ఖరారు చేశారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో ఆయన ప్రచారం మాకు వద్దంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం. కాపు వర్గంలో ఆయన విశ్వసనీయత కోల్పోయారని, అటువంటి వ్యక్తి ప్రచారానికి వస్తే వచ్చే ఓట్లు కాస్త పక్కకు మరలినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నట్లు సమాచారం.

విలీనంతోనే క్రెడిట్‌ గోవిందా...!
పిఆర్‌పి ఏర్పాటుసమయంలో కాపు సామాజికవర్గంలో ఎన్నలేని ఆశలు ఉండేవని, ఆ ఆశలను కాంగ్రెస్‌లో పార్టీని విలీనంచేయడంతో అడియాశలు చేశారని ఆయన సమాజికవర్గంలో భావన నెలకొందని కొందరు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.ఈ కారణం చేతనే చిరంజీవికి ప్రచారానికి వచ్చినా ప్రయోజనం లేదని పైగా వచ్చే ఓట్లు కూడా పక్కకు మళ్లే ప్రమాదముందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు గగ్గొలు పెడుతున్నట్లు ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత ఒకరు చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగే ఒక నియోజకవర్గ అభ్యర్థి సైతం చిరు ప్రచారానికి రాకపోతేనే మేలన్న అభిప్రాయన్ని వ్యక్తంచేస్తున్నట్లు తెలిసింది.ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో తూర్పు, పశ్చిమగోదావరిజిల్లాలతోపాటు రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాలలో కాపు ఓట్లకు గాళం వేయాలంటే చిరు ప్రచారం తప్పని సరిగా కాంగ్రెస్‌ నాయకత్వం భావించింది.ఈ కారణం చేతనే ఉప ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌లో మెజార్టీ నియోజకవర్గాలలో చిరంజీవి ప్రచారం కార్యక్రమాన్ని ఖరారుచేశారు.ఇదిలా వుంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలు కొందరు చిరంజీవి ప్రచారం వద్దు అన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేసుతన్నట్లు తెలిసింది. పిఆర్‌పిని ఏర్పాటుచేయడం అనతికాలంలోనే కాంగ్రెస్‌లో పార్టీని విలీనంచేయడంతో చిరంజీవికి ఉన్న క్రెడిట్‌ కాస్త తగ్గిందన్న భావనను కాంగ్రెస్‌ నేతలు వ్యక్తంచేస్తున్నారు.మరీ ముఖ్యంగా పార్టీని విలీనంచేయడం పట్ల కాపు వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా చెబుతున్నారు. పార్టీ పెట్టినప్పుడు తమ సామాజిక గౌరవం పెరుగుతుందన్న భావనలో నాడు కాపు వర్గాలు ఉండేవని, విలీనం ప్రక్రియతో చిరు పట్ల వారి వైఖరిలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఈ కారణాల చేత చిరు ప్రచారం ప్రయోజనం కంటే నష్టమే మిగిల్చవచ్చని వారు పేర్కొంటున్నారు.


Source: http://www.andhrayouth.com/telugu/view_news.php?id=24157&typ=scoops