Jun-04-2012 10:58:37 | |
ప్రభాస్,అనుష్క కాంబినేషనలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారధి.ఈ చిత్రం టైటిల్ మరీ సాఫ్ట్‌గా ఉందని దానిని ‘రుద్ర’గా మార్చటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. దాదాపు తొంభెై శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది అని చెబుతున్నారు. ప్రభాస్ పెద నాన్న కృష్ణంరాజు కెరిర్‌లో రుద్రయ్య అనే టైటిల్‌తో గతంలో హిట్ చిత్రాలు వచ్చాయి. దాంతో రుద్ర అనే టైటిల్ కలిసివస్తుందని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో కథ గురించి చెప్పుకోవాలం టే..మనసు, అద్దం రెండూ ఒక్కటే. ఒక్కసారి ముక్కలయిపోతే మళ్లీ అతుక్కోవు. కానీ అలాంటి మనసులకూ మరమ్మత్తులు చేశాడో యువకుడు. అతని కథేంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.. ఈ చిత్రంలో అనుష్కతో పాటు మరో హీరోయిన్‌గా రిచా గంగోపాధ్యాయ నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వి.వంశీకృష్ణ, ప్రమోద్ నిర్మాతలు.
Source:http://www.andhrayouth.com/telugu/view_news.php?id=24212&typ=gossips |