బెంగళూరు, న్యూస్‌లైన్: అత్యాధునిక సాంకేతిక విలువలతో ఒక్కో సినిమాను నెలల తరబడి తీస్తున్న ఈ కాలంలో కన్నడ సినిమారంగంలో ఓ రికార్డు నమోదైంది. కేవలం ఒక గంటా 54 నిమిషాల్లోనే.....
‘నమ్మ యేరియల్లి ఇన్నొందు దిన(మా ప్రాంతంలో మరో దినం)’ పూర్తి సినిమాను నిర్మించడం విశేషం. మంగళవారం ఉదయం 8గంటలకు బెంగళూరులో ముహూర్తపు షాట్‌తో మొదలైన సినిమా నిర్మాణం 9.54కు పూర్తయింది.
8 మంది యువకథానాయకుల కథతో చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు అరవింద్ కౌశిక్ తెలిపారు. ఈ సినిమా కోసం రెండు ఆర్‌ఈడీ కెమెరాలు, 5డీ కెమెరాలను ఉపయోగించారు. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాత అణజి నాగరాజ్ ప్రకటించారు. కాగా, తక్కువ సమయంలో నిర్మితమైన సినమాగా సుగ్రీవ అనే కన్నడ చిత్రం గతంలో రికార్డు నెలకొల్పింది. దీనిని 18 గంటల్లో తీశారు.