NEWS

Blogger Widgets

4.7.12

రెండేళ్ల బాలికకు అరుదైన శస్త్రచికిత్స


దక్షిణాసియాలో తొలిసారి ఆగ్జిలరీ లివర్ మార్పిడి
హైదరాబాద్, న్యూస్‌లైన్: దక్షిణాసియాలోనే తొలిసారి రెండేళ్ల బాలికకు ఆగ్జిలరీ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినట్లు గ్లోబల్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఓమన్‌కు చెందిన యాస్మిన్ అనే రెండేళ్ల వయస్సున్న బాలిక హెపటైటిస్-ఏకి గురై కోమాలోకి వెళ్లింది. మెదడువాపుతోపాటు బ్లడ్‌కోయాగ్లోపతి సమస్య తలెత్తింది.....

వీటికితోడు కామెర్లు సోకడంతో లివర్ దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం చెన్నైలోని గ్లోబల్ హెల్త్‌సిటీలో డాక్టర్ మహ్మద్ రేలా బృందం పది గంటలపాటు క్లిష్టమైన ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ శస్త్రచికిత్సలో యాస్మిన్ లివర్‌లో దెబ్బతిన్న భాగాన్ని తొలగించి ఆమె బంధువు నుంచి తీసిని లివర్ భాగాన్ని కలిపారు. డాక్టర్ మహ్మద్ రేలా ఇంతకుముందు లండన్‌లోని కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో తొలిసారిగా ఈ తరహా ఆపరేషన్‌ను నిర్వహించారు.