NEWS

Blogger Widgets

4.7.12

నిత్యానంద మెడకు ఫౌండేషన్ ఉచ్చు


రూ. 8,800 కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పిన కాలిఫోర్నియా కోర్టు
బెంగళూరు, న్యూస్‌లైన్: కాలిఫోర్నియాలోని ఆశ్రమంలో బోగస్ ఫౌండేషన్ పేరుతో విరాళాలు సేకరించి వివాదాస్పద గురువు నిత్యానంద దుర్వినియోగం చేశారని మంగళవారం స్థానిక కోర్టు తీర్పునిచ్చింది. బాధితులకు ఫౌండేషన్ నిర్వాహకులు 1.6 బిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో రూ.8,800 కోట్లు)...... నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. ఇదే కేసు విషయంలో నిత్యానంద ఫౌండేషన్ నిర్వాహకుడు నిత్య గోపాలచిన్నరెడ్డి అలియాస్ గోపాల చిన్నరెడ్డికి ఈనెల 19న శిక్ష ఖరారు చేస్తామని పేర్కొంది.

అమెరికాలో ఉండే నిత్యానంద భక్తుడైన ప్రవాస భారతీయుడు పప్పట్‌లాల్ చావ్లా కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆశ్రమాల్లో ఉంటున్న భక్తులతో నిత్యానంద కాంట్రాక్టు కుదుర్చుకుని టెక్నాలజీ సెక్స్ సాగిస్తున్నారని చావ్లా కోర్టుకు విన్నవించారు. ఈ విషయాన్ని న్యాయస్థానం ముందు నిత్యానంద ఫౌండేషన్ నిర్వాహకులు ఒప్పుకున్నారు. దీంతో నిత్య గోపాలచిన్నరెడ్డిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇదిలాఉండగా నిత్యానందపై మంగళవారం మరో కేసు నమోదైంది. ఇటీవలే ఆశ్రమానికి వెళ్లిన తమ కుమారుడు సంతోష్ తిరిగిరాలేదని అతని తల్లిదండ్రులు కర్నాటక రాష్ర్ట హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ సమర్పించారు.