NEWS

Blogger Widgets

4.7.12

ఇక రోజుకు 4 లక్షల రైల్వే ఈ-టికెట్లు


న్యూఢిల్లీ: రైల్వే ఈ-టికెట్లకు(ఆన్‌లైన్ బుకింగ్స్) డిమాండ్ పెరుగుతుండడంతో వాటి సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటి సంఖ్యను రోజుకు ప్రస్తుతమున్న.... 3.5 లక్షల నుంచి వచ్చే నాలుగు నెలల్లో 4 లక్షలకు, ఆ తర్వాత 8 లక్షలకు పెంచనుంది. ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ), సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(క్రిస్) ఈ దిశగా కసరత్తు చేస్తున్నాయని ఆ శాఖ సహాయ మంత్రి కేహెచ్ మునియప్ప మంగళవారం తెలిపారు. బ్లాక్ మార్కెట్‌లో టికెట్ల అమ్మకాలకు సంబంధించి జరిపిన ఆకస్మిక తనిఖీల్లో 170 మంది అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని తేలిందని, వారిలో 102 మందిపై చర్యలు ప్రారంభించామని వెల్లడించారు.