బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని సురత్ థానీ రాష్ట్రంలో మంగళవారం జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు సహా 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు.....
మరో 17 మంది గాయపడ్డారు. కోహ్ ఫంగాన్ బీచ్‌కు పర్యాటకులను తీసుకెళ్తున్న బస్సు టైరు పగిలిపోవడంతో అది అదుపు తప్పి కరెంటు స్తంభానికి ఢీకొంది. మృతుల్లో ఇద్దరు భారతీయులు, ఎనిమిది మంది థాయ్ వాసులు ఉన్నారు. భారతీయ మృతుల్లో ఒకరిని అమిత్ జైన్‌గా గుర్తించినట్లు థాయ్ మీడియా తెలిపింది.