రాసలీలల స్వామి నిత్యానంద ట్రస్టులో అంతా మోసం జరుగుతోందని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు తేల్చింది. అంతేకాదు నిత్యానంద ఆధ్వర్యంలో అక్కడ ట్రస్టును నడిపిస్తున్న కన్వీనర్ నిత్య గోపాలనందకు జులై 19న శిక్ష కూడా ప్రకటించబోతోంది. ఆశ్రమంలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని నిత్య గోపాలనందను 2010లో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.
భక్తి ముసుగులో ప్రవాస భారతీయ భక్తుల నుంచి వేల కోట్ల రూపాయల విరాళాలను నిత్యానంద ట్రస్టు సేకరించింది. ఈ డబ్బుతో అశ్లీల, అభ్యంతరకర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మఫత్ లాల్ చావ్లా అనే భక్తుడు అమెరికా కోర్టులో ఫిర్యాదు చేశారు. అంతేకాదు... తానిచ్చిన విరాళాన్ని వడ్డీతో సహా తిరిగి ఇప్పించాలని కోర్టుకు విన్నవించుకున్నాడు.
ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు ఫిర్యాదుదారునికి 1.6 బిలియన్ డాలర్లను చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇంకా విదేశాలలో నిత్యానంద ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయా ట్రస్టులపైనా ఆయా దేశాలు కన్నేసినట్లు సమాచారం.