- యూపీ ఎమ్మెల్యేలకు సీఎం అఖిలేష్ ఆఫర్
- తప్పుబట్టిన బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలంతా వారి స్థానిక అభివృద్ధి నిధి (లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్) నుంచి రూ. 20 లక్షల .....
వరకూ కార్లు కొనుక్కునేందుకు తీసుకోవచ్చని మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఐదేళ్ల తర్వాత ఈ వాహనాల తరుగు విలువను చెల్లించి ఎమ్మెల్యేలు వాటిని సొంతం చేసుకోవచ్చన్నారు.
కార్లు కొనుక్కునే స్థోమత లేని ఎమ్మెల్యేలకు ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందన్నారు. అ లాగే ఎమ్మెల్యే నిధిని ప్రస్తుతమున్న రూ. 1.25 కోట్ల నుంచి 1.50 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే సీఎం ప్రకటనను బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ తప్పుబట్టాయి. ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలనిస్తుందని విమర్శించాయి. కార్ల కొనుగోలుకు తమ ఎమ్మెల్యేలు అభివృద్ధి నిధులను వినియోగించబోరని స్పష్టం చేశాయి.