NEWS

Blogger Widgets

4.7.12

ఆగస్టు 7న ఉప రాష్ట్రపతి ఎన్నిక


- అదే రోజు ఫలితాలు
- షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఆగస్టు 7న.... ఈ ఎన్నిక జరగనుంది. అదే రోజు ఫలి తాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించి ఈసీ జూలై 6న లాంఛనంగా నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు జూలై 20 చివరి తేదీ. 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 23 చివరి తేదీ. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారింగా ఈసీ నియమించింది.

లోక్‌సభ సచివాలయంలోని అధికారుల్లోంచి ఒకరిని సహాయ రిటర్నింగ్ అధికారిగా నియమించాలని నిర్ణయించింది. ఉప రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్‌కు చెందిన పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఎన్నుకుంటా రు. ప్రస్తుతం పార్లమెంటులో మొత్తం 790 మంది సభ్యులు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలా కాకుండా ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాజ్యసభ, లోక్‌సభ నామినేటెడ్ సభ్యులు ఓటేసేందు కు అర్హత కలిగి ఉంటారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది.