NEWS

Blogger Widgets

4.7.12

రెండో షిఫ్ట్ పాలిటెక్నిక్‌కు ‘నో’


అనుమతి నిరాకరించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇంజనీరింగ్ కళాశాలల్లో రెండో షిఫ్ట్‌లో పాలిటెక్నిక్ కోర్సుల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 103 కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినప్పటికీ.. రాష్ట్రప్రభుత్వం వీటి నిర్వహణకు అనుమతి నిరాకరించింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ వీటికి అనుమతి ఇస్తే.. దాదాపు 12 వేల సీట్లు అందుబాటులోకి వచ్చేవి. కేవలం లాభాపేక్షతో పుట్టగొడుగుల్లా కళాశాలలు పుట్టుకొస్తున్నందున ఇంజనీరింగ్ కళాశాలల్లో రెండో షిఫ్ట్‌కు అనుమతి ఇవ్వకూడదని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. కేవలం కొత్త పాలిటెక్నిక్ కళాశాలలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.

అయితే ఇంకా రెండు కొత్త ప్రభుత్వ కళాశాలలకు పాలిటెక్నిక్ వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఉన్నత విద్యాశాఖ జీవో జారీచేయాల్సి ఉందని కౌన్సెలింగ్ క్యాంపు అధికారి రఘునాథ్ తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 22,200, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 49,800 సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. మంగళవారం నాటికి 27 వేల మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు ఇచ్చారని తెలిపారు. జూలై 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ, వెబ్‌కౌన్సెలింగ్ కోసం ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ జూలై 7 వరకు కొనసాగుతుందని తెలిపారు.