NEWS

Blogger Widgets

4.7.12

తెలంగాణకు సీఎం పదవి: పాల్వాయి


హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ వ్యక్తికి సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉందని, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచిస్తోందని ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి చెప్పారు. రాష్ర్టపతి ఎన్నిక తరువాత తెలంగాణ సమస్య,.... నాయకత్వ మార్పుపై హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. సీఎల్పీ కార్యాలయం ఆవరణలో ఆయన మంగళవారం మాట్లాడుతూ తెలంగాణపై నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే నాయకత్వాన్ని మార్చే అవకాశముంటుందన్నారు.

తెలంగాణ బాగుపడాలంటే రాష్ట్ర ఏర్పాటే శరణ్యమన్నారు. తెలంగాణ వ్యక్తి సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయమే జరిగిందన్నారు. పదవిని సీమాంధ్రోళ్లు ఎక్కడ గుంజుకుంటారోననే భయంతో తెలంగాణ అభివృద్ధిని విస్మరించారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుందని ఎవరైనా అంటే జనం నవ్వుతున్నారని వ్యాఖ్యానించారు.