బాలకృష్ణ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. మంచు మనోజ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ఆత్మగా కనపడతారని ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గాంధర్వ మహల్లోకి హీరో మనోజ్ ప్రవేశించాక కథ మొదలవుతుందని, అక్కడ బాలకృష్ణ ఆత్మ కలుస్తుందని, హర్రర్, కామెడీ కలగలిసే ఈ సన్నివేశాల్లో బాలకృష్ణ ప్లాష్ బ్యాక్ విన్న హీరో ఆయన ఆశయం తీర్చటమే సినిమా ముఖ్య కథాంశం అని తెలుస్తోంది. మనోజ్ సరసన దీక్షాసేథ్ నటిస్తోంది.
శేఖర్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం విడుదల తేదీ ఖారారైంది. జూన్ 22వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు నిర్మాత మంచు లక్ష్మి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోంది. బాలయ్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా భారీగా థియేటర్లను దక్కించుకుని ఓపెనింగ్స్ రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన రూ. 6.5 కోట్లతో గాంధర్వ మహల్ సెట్టింగ్ వేయడం ఇప్పుడు పరిశ్రమ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది. లక్ష్మి అంత ఖర్చు పెట్టి సెట్ వేసి సాహసం చేస్తుండటం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. అయితే బాలయ్య క్యారెక్టర్ గురించే ఆ సెట్ వేశారట. ఇందులో ఆయన జమిందార్ పాత్రలో కనిపించబోతున్నారు.
అయితే మంచు లక్ష్మి నమ్మకం అంతా సినిమా కథ, స్ర్కిప్టుపైనే నంట. అందులో అంత దమ్ముంది కాబట్టే ఖర్చుకు వెనకాడటం లేదంటున్నారు. అదే విధంగా బాలయ్య ఇమేజ్ ఈ చిత్రాన్ని ఓ రేంజికి తీసుకెలుతుందని భావిస్తుందట. బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రాన్ని మంచు లక్ష్మి ప్రసన్న మంచు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తోంది. ఈ చితానికి కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం శేఖర్ రాజ. బెబో శశి సంగీతం అందిస్తున్నారు. బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.