NEWS

Blogger Widgets

11.6.12

హెలికాప్టర్ ప్రమాదంలో కెన్యా కేబినెట్ మంత్రి మృతి



నైరోబి, జూన్ 10: కెన్యా అంతర్గత భద్రతా మంత్రి జార్జ్ సైటోటి ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు మరో ఐదుగురు చనిపోయారని కెన్యా ఉపాధ్యక్షులు కలొన్జో ముస్యోకా విలేఖరులకు తెలిపారు. ఈ సంఘటన పట్ల ముస్యోకా దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల్లో కెన్యా అంతర్గత భద్రతా సహాయమంత్రి జాషువా ఓర్వా ఒజోడె సైతం ఉన్నారన్నారు. ఇద్దరు పైలట్లు, మరో ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది సైతం మృత్యువాత పడినట్లు వివరించారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై మాట్లాడేందుకు ముస్యోకా నిరాకరించగా, నైరోబి సమీపంలోని ఎన్గాంగ్ కొండల్లో భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది.
నైరోబిలోని విల్సన్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ హెలికాప్టర్ కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఇదిలావుంటే వచ్చే ఏడాది కెన్యా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీచేయాల్సి ఉన్న సైటోటి.. గతంలో దేశ ఉపాధ్యక్షుడిగా దీర్ఘకాల సేవలను అందించారు. తీవ్రవాద ప్రాబల్యం అధికంగా ఉన్న కెన్యాలో భద్రతాపరమైన చర్యలను చేపట్టడంలో సైటోటి కీలకపాత్ర వహించారు. ముఖ్యంగా పొరుగుదేశం సోమాలియా నుంచి ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధాలు నెరపుతూ దాడులు చేస్తున్న షెబాబ్ తిరుగుబాటుదారులను అణచివేయడంలో సైటోటి ప్రధానపాత్ర పోషించారు.