NEWS

Blogger Widgets

11.6.12

తెలంగాణ రాణి గా తమన్నా




వరస విజయాలతో పెద్ద హీరోల సరసన సినిమాలు పట్టుకుంటూ దూసుకుపోతున్న హీరోయిన్ తమన్నా. ఆమె తాజాగా తెలంగాణా ప్రాంత వరంగల్ ని ఏలిన రాణి 'రుద్రమదేవి' పాత్రను కమిటైనట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రీసెంట్ గా ఆమెను కలిసి కథ వినిపించి ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు. అయితే డేట్స్ ఖాళీ లేవని చాలా కాలం పడుతుందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రం చేయటానికి గుణశేఖర్ కంటిన్యూగా డేట్స్ అడిగాడని వినికిడి.
ఈ ప్రాజెక్టు గురించి గుణశేఖర్ మీడియోతో మాట్లాడుతూ...''ఒక్కడు' తరవాత మొదలైన ఆలోచన 'రుద్రమదేవి'. అప్పటి నుంచీ ఈ కథపై కసరత్తు చేస్తూనే ఉన్నాను. ఇలాంటి కథను టెక్నికల్ గా అత్యున్నత విలువలతో నిర్మించాలి. అందుకే ఇంతకాలం వేచి చూశాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఈ కల త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది'' అని చెప్పారు. ఇంతకీ హీరోయిన్ ఓకే అయినప్పుడే కదా ప్రాజెక్టు పట్టాలెక్కేది అంటున్నారు.