NEWS

Blogger Widgets

11.6.12

ఎన్నికల్లో డబ్బు పంపిణీని నిరోధించేందుకు చర్యలు: సంపత్



EC
ఎన్నికల్లో డబ్బు పంపిణీని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన వీరవల్లి సుందరం సంపత్ తెలిపారు. ఎన్నికల సంస్కరణలే ప్రధాన ఎజెండాగా పనిచేస్తూ., నేరచరితులను ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసేందుకు కృషి చేస్తానన్నారు. 

ఆరేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న ఖురేషి పదవీ కాలం ఆదివారంతో ముగియడంతో సంపత్ సోమవారం 18వ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. 

గత 1950వ సంవత్సరం జనవరి 16వ తేదీన పుట్టిన సంపత్ 1973వ సంవత్సరం ఐఏఎస్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనులను నిర్వర్తించారు. అనంతరం గత 2009వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ ఎన్నికల కమిషనర్లలో ఒకరిగా సంపత్ నియామకం అయ్యారు. 

ప్రస్తుతం 18వ ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించిన సంపత్ మూడేళ్ల పాటు 2015 జనవరి వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇకపోతే 2014లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు 17 రాష్ట్రాల సాధారణ ఎన్నికలు సంపత్ ఆధ్వర్యంలో జరుగనున్నాయి.