
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. తిరుపతిలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి దివంగతుడయ్యాక ఎవరు సంతకాల సేకరణ చేసిందన్న విషయంపై జగన్ క్యాంప్ నుంచి తొలిసారిగా మాట్లాడారు.ఇంతవరకు జగనే సంతకాల సేకరణ చేయించారని,శవ రాజకీయ చేశారని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తుంటారు.షర్మిలా ఆ విమర్శలకు సమాధానంగా అప్పట్లో జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ సంతకాల సేకరణ చేయించింది కేంద్ర మంత్రి, పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీగా అప్పట్లో ఉన్న వీరప్ప మొయిలీ అని ఆమె వెల్లడించారు. వారిద్దరే కాకుండా వై.ఎస్.కుటుంబానికి సన్నిహితంగా ఉండే మరికొందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిలా చెప్పినదానిలో నిజం లేకపోలేదు. అయితే అప్పుడు ఆ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వీరు అడ్డుకుని ఉండి ఉంటే బాగుండేది. కాని అప్పట్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరు ప్రముఖులు కెవిపికాని, వీరప్ప మొయిలీ కాని దానిని నిర్వహించినందున ఎవరూ అడ్డుపడే అవకాశం ఉండదు. సంతకాల సేకరణతో అధిష్టానం జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తుందని వారు భావించి ఉంటారు.కాని సోనియాగాంధీ మరో రకంగా నిర్ణయం తీసుకుని ఆ వ్యవహరానికి కొత్త మలుపు సృష్టించారు. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు జరిగాయి.