NEWS

Blogger Widgets

11.6.12

పవన్‌కళ్యాణ్‌కు ఎందుకింత క్రేజో అర్థంకాలేదు: నాగబాబు


Julaayi Audio Function
వాళ్ళంతా పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అభిమానులు. అల్లు అర్జున్‌ 'జులాయి' ఆడియో వేడుకకు వచ్చారు. ఆదివారం రాత్రి ఈ వేడుక మాదాపూర్‌లో జరిగింది. ఈ కార్యక్రమం ఆరంభంనుంచి పవర్‌స్టార్‌ ఎప్పుడు వస్తారంటూ... ఫ్యాన్స్‌ గోలగోల చేస్తూనే ఉన్నారు. ఫైనల్‌గా అందరూమాట్లాడాక.... పవర్‌స్టార్‌ అంటూ నినాదాలు చేయడంతో... ఆయన మాట్లాడారు. ఏదో మాట్లాడతారని అంతాఅనుకుంటే.... 

చాలా సింపుల్‌గా- అభిమానంతో వచ్చిన ఆత్మీయులందరికీ అభినందనలు. అల్లు అర్జున్‌గారికి, దానయ్యగారికి, రాధాకృష్ణగారికి మంచి సక్సెస్‌ సాధించాలని.. సెలవుతీసుకుంటున్నానని చెప్పారు. ముందుగా జులాయి ఆడియోను పవన్‌కళ్యాణ్‌ విడుదలచేసి దాసరి నారాయణరావుకు అందించారు. అయితే.... ఫంక్షన్‌లో పాల్గొన్న అతిధులు ఎవరూ చిరంజీవి పేరును ప్రస్తావించకుండా కార్యక్రమం నడపడం విశేషం. మిమిక్రీచేసేవారు.. యాంకర్‌ మినహా ఆ పేరును ప్రస్తావించలేదు.

జనాల్లో రీచ్‌ అయ్యాడు: అల్లు అర్జున్‌
పవన్‌కళ్యాణ్‌ గురించి అల్లు అర్జున్‌ గొప్పగా చెప్పాడు. హీరో అనేవాడు.. డాన్స్‌లు వేస్తే, ఫైట్స్‌లు చేస్తే.. డైలాగ్‌చెపితే కాలేడు. స్టార్‌ అనేవాడు లోపలనుంచి పుడతాడు. సెల్ప్‌ కాన్ఫిడెన్స్‌ ఉండాలి. అలాంటి వ్యక్తి పవర్‌స్టార్‌. ఆయన జనాల్లోకి రీచ్‌ అయ్యాడు. ఆయనకు ఆయనే పోటీ. ఇంకెవరూ పోటీకాదు. ఆయన వ్యక్తిత్వం ముఖ్యం. గబ్బర్‌సింగ్‌ రికార్డులు బద్దలుకొడుతోంది. పోస్టర్‌లో ఎక్కడా ఆ రికార్డులుండవు. ఇదే ఆయనలోన్ను పొగరు. అది అందరికీ రాదు. పవన్‌కళ్యాణ్‌ రియల్‌స్టార్‌..అని చెప్పారు.

పవన్‌కళ్యాణ్‌కు ఎందుకింత క్రేజో అర్థంకాలేదు: నాగబాబు

పవన్‌కళ్యాణ్‌ పెద్దగా మాట్లాడడు. గొప్ప నటుడు కాదు, డాన్సర్‌ కాకపోవచ్చు. అయినా ఎందుకింత క్రేజ్‌ వచ్చింది. ఇది నాకు ఎప్పుడూ అర్థంకాని పరిస్థితి 'తొలిప్రేమ'నుంచి ఇదే ఆలోచన. ఆఖరికి అర్థమయింది. ఒక్కటే... హీరో కన్నా వ్యక్తిత్వం గొప్పది. అందుకే అంతమంది అభిమానులకు కారణం. వాడేంటో చెప్పడు. సినిమాలద్వారా చూపిస్తాడు. గ్రేట్‌ హ్యూమన్‌బీయింగ్‌. ప్రౌడ్‌ ఆఫ్‌ మై బ్రదర్‌... అంటూ గర్వంగా చెప్పారు.

అల్లురామలింగయ్యను గుర్తుచేసుకున్న దాసరిజులాయి ఆడియో వేడుకలో సభికులు ఎవ్వరూ చిరంజీవిని గుర్తుచేసుకోకపోవడం ఒక విషయమైతే... దాసరి నారాయణరామావు మాట్లాడుతూ... పవన్‌కళ్యాణ్‌గురించే ప్రస్తావించారు. పవన్‌కళ్యాణ్‌కు మనసుకు నచ్చితేనే ఫంక్షన్‌కు వస్తాడు. ఇక త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ రచయితగా దర్శకుడయ్యాడు. అలా అవ్వడం కష్టం. కథమాటలు రాసేవారు దర్శకులుకాలేరు. ఒక దాసరినారాయణవు అయ్యాడు. ఆ తర్వాత జంథ్యాల అయ్యారు. దాన్ని తిరగరాశారు త్రివిక్రమ్‌. అంటూ... పాలకొల్లులో ఒకతను పుట్టాడు. 

వేషాలకోసం మదరాసు వచ్చాడు. హాస్యపాత్రలు వెయ్యి చేశాడు. ఆయనకు కొడుకు పుట్టాడు. ఆయననిర్మాతగా మారాడు. ఆయనకూ కొడుకుపుట్టాడు. తనే బన్నీ... గంగోత్రి చూశాక... ఏ తరహా హీరో అవుతాడో. అని అనుమానం వచ్చింది. దేశముదురు చూశాక... ఆయన టాలెంట్‌ చూపించాడు. ఏదైనా అవుతాడని నిరూపించారు. ఈనాటి జనరేషన్‌కు బన్నీ ఫాలోఅవ్వాలని అన్నారు. ఫంక్షన్‌కు హీరోయిన్‌ రావాలి. అది బాధ్యత హీరోయిన్‌ రాకపోవడంపట్ల దాసరి కోపం ప్రదర్శించారు.