ఏం పిల్లో..ఏం పిల్లడో చిత్రంతో హీరోయిన్‌గా నటించిన కన్నడ భామ ప్రణీతకు గ్లామరస్‌గా మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత బావ చిత్రంలో సిద్దార్థతో కలిసి నటించినా ఆమెకు అదృష్టం అంతగా వరించలేదు. అనూ హ్యంగా తమిళనాట ప్రణీతకు ఒక్కసారిగా అదృష్టం అందల మెక్కించింది. తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో కార్తీక్ సరసన ‘శకుని’ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఇప్పుడు తమిళంలో, తెలుగులోనూ నిర్మాతల దృష్టి మళ్లీ ప్రణీతపెై పడింది. మొదటి రెండు చిత్రాలలో పద్ధతిగా నటించిన ప్రణీత శకుని చిత్రంతో తన పూర్తిస్థాయి గ్లామర్‌ను ప్రదర్శించింది. లంగా, ఓణీలలో తెలుగు భామలను గుర్తుచేసిన ప్రణీత ఇప్పుడు మోడరన్ లుక్స్‌లోనూ కిక్కెస్తోందంటూ అభిమానులు పొంగిపోతున్నారు.
|