NEWS

Blogger Widgets

11.6.12

సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించాలి




హైదరాబాద్‌ : అవినీతి నిర్మూలనతో పాటు విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు సీబీఐని లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకొచ్చి, స్వయంప్రతిపత్తి కల్పించాలని యోగా గురువు బాబా రాందేవ్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. నల్లధనం వెలికితీత, అవినీతి నిర్మూలన కోసం ఆగస్టు 8న ఢిల్లీలో మహా ఉద్యమం చేపట్టనున్నామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టుకునే క్రమంలో ఆయన ఈరోజు హైదరాబాద్‌ వచ్చారు. ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయంలో అభిమానులు స్వాగతం పలికారు. రేపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలను ‚కలుస్తానని ఆయన తెలిపారు.