సోమవారం, 18 జూన్ 2012( 09:56 IST )
స్విస్ బ్యాంకులలో భారతీయుల డబ్బు గత ఐదేళ్లలో తొలి భారీగా పెరిగింది. కానీ, మొత్తం విదేశీ సంపదలో కేవలం 0.14 శాతం మాత్రమే అక్కడ డిపాజిట్ చేస్తున్నారు. స్విస్ బ్యాంకులలో విదేశీ నగదు కలిగివున్న దేశాలలో భారత్ 55వ స్థానంలో వున్నది.
గత 2011 సంవత్సరాంతానికి స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న మొత్తం విదేశీ నగదు 1.53 ట్రిలియన్ స్విస్ ఫ్రాన్స్ (దాదాపు 90 ట్రిలియన్ రూపాయలు). ఇందులో 2.18 బిలియన్ స్విస్ ఫ్రాన్స్‌లు (రు.12,700కోట్లు) భారతీయులు, సంస్థలకు చెందినవి. స్విస్ బ్యాంకులో డబ్బు దాచుకున్న దేశాలలో బ్రిటన్ అగ్రస్థానంలో ఉంది.
ఆ తర్వాత స్థానంలో 18 శాతంతో అమెరికా ఉన్నట్టు స్విస్ జాతీయ బ్యాంకు (ఎస్.ఎన్.బి.) తాజాగా వెల్లడించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ 55వ స్థానంలో ఉంది. ఇక్కడ డబ్బు దాచుకున్న దేశాలలో బ్రిటన్, అమెరికాతో పాటు అగ్రస్థానంలో ఉన్న దేశాలలో వెస్టిండీస్, జెర్సీ, జర్మనీ, బహమాస్, లగ్జంబర్గ్, పనామా, ఫ్రాన్స్, హంగ్‌కాంగ్, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇటలీ, నెదర్లాండ్స్, రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి.