నేను మెగాస్టార్‌గా పేరు సంపాదించు కున్నానంటే... అది కె.రాగవేంద్రరావు దర్శకత్వం వహించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాతోనే అని చిరంజీవి అన్నారు. మా కుటుంబానికి ఆయన శ్రేయోభిలాషి. ఈరోజు మాటీవీ నిర్వహించిన అవార్డును అందుకోవడం గర్వంగా వుందని అన్నారు. ఆదివారం రాత్రి మాటీవీ సినిమా అవార్డ్స్ -2012 పేరుతో పలు అవార్డులు ప్రకటించింది. ఈసందర్భంగా చిరంజీవి మాట్లాడారు. జితేంద్రలాంటి హీరోకు ఆయన పునర్జీవం పోశారు. ఆయనకు 70 సంవత్సరాలైనా మనస్సు మాత్రం పదిహేడే. భక్తితోపాటు రక్తిని వదలొద్దని ఆయనకు మనవి చేసుకుంటున్నాను అన్నారు. మాటీవీ, ఫెయిర్ అండ్ లవ్‌లీ కలిసి నిర్వహించిన మా అవార్డ్స్ ప్రదానోత్సవం ఆదివారం రాత్రి నోవాటెల్ హౌటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, దర్వకలు పాల్గన్నారు. జీవిత సాఫల్య పురస్కారం కె.రాగవేంద్రరా వుకు అందుకున్నారు. ఈసందర్బంగా అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ రాఘవేంద్రరావు అసిస్టెంట్ దర్శకుడిగా నాకు తెలుసు. ఏమీలేని వాడిని వున్నవాడిగా చూపించే టాలెంట్ వుంది. హీరోయిన్లకు చాలా అందంగా చూపిస్తారు. ఇలాంటి దర్శకుడు అన్నమయ్య తీస్తాడు అన్నప్పుడు చాలా మంది ఆయన్ని, నాగార్జునను విమర్శించారు. ఆ తర్వాత చిత్రం తీసి సత్తా చాటాడు. లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డురావడం సముచితంగా వుందన్నారు. మహేష్‌బాబు మాట్లాడుతూ చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా వుంది. దూకుదు సినిమా నాకెరీర్‌లో ప్రత్యేకమూవీ. ఇటీవలే టీవీలో కూడా చూశాను. చాలా ఆసక్తిక రంగా అనిపించింది. ఆ చిత్ర టీమ్‌కు నిర్మాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను' అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కమల్‌హాసన్, శృతిహాసన్, రాజమౌళి, అల్లు అరవింద్, రామానాయుడు, మురళీమోహన్, బ్రహ్మానందం పాల్గొన్నారు.