హూస్టన్/వాషింగ్టన్: షికాగోలోని ప్రతిష్టాత్మక ఇల్లినాయిస్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ పదవి భారతీయ అమెరికన్‌ను వరించింది. పరిశోధకురాలు, అడ్మినిస్ట్రేటర్, అధ్యాపకురాలిగా అసమాన ప్రతిభను ప్రదర్శించిన మిత్రా దత్తాకు ఈ గౌరవం దక్కింది. ఈమె ఇంతకుముందు అమెరికా ఆర్మీ రీసెర్చ్ కార్యాలయంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. గత జనవరి నుంచి ఇల్లినాయిస్ వర్సిటీకి తాత్కాలిక వీసీగా వ్యవహరిస్తున్నారు. దత్తా గువాహటి వర్సిటీలో బీఎస్సీని, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ని పూర్తిచేశారు. ఇదిలా ఉండగా ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో భారతీయ అమెరికన్ అంజనీ జైన్‌కు అరుదైన గౌరవం దక్కింది. వర్సిటీలోని అత్యున్నత పదవికి ఆయన్ను ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఎస్‌ఓఎం)లో పూర్తిస్థాయి ఎంబీఏ ప్రోగ్రామ్‌కు సీనియర్ అసోసియేట్ డీన్‌గా జైన్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది.
|