న్యూఢిల్లీ: ఐఐటీ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన తొలి దశ కౌన్సెలింగ్‌లో ఐఐటీ బాంబే క్యాంపస్ హవా కొనసాగింది. ఐఐటీ ఎంట్రన్స్‌లో తొలి 100 స్థానాల్లో నిలిచిన విద్యార్థుల్లో 86 మంది ఆ క్యాంపస్‌నే ఎంపిక చేసుకున్నారు. మిగిలిన వారిలో 12 మంది ఐఐటీ ఢిల్లీ, ఒకరు ఐఐటీ కాన్పూర్, మరొకరు ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లను ఎంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ కోర్సుల వైపే వారంతా మొగ్గు చూపారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది కౌన్సెలింగ్ కోసం మొత్తం 15,989 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా వారిలో 17,465 మందిని ఎంపిక చేశామని చెప్పారు.
|