హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బంధువులు,సన్నిహితులకు చెందిన 10 విదేశీ బ్యాంక్ ఖాతాల వివరాలను కోలా కృష్ణమోహన్ వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయలేకపోయిన్నట్లు తెలిపారు. అందుకే పత్రికా ప్రకటన విడుదల చేశానన్నారు. 1998కి ముందే ఈ ఖాతాలను తెరిచినట్లు తెలిపారు.
హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ ఛార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ఈ ఖాతాలను తెరిచినట్లు వివరించారు. లక్షలాది డాలర్ల మేర లావాదేవీలు వీటిలో జరిగాయి. ఈ వివరాలన్నింటినీ హైకోర్టు, కేంద్రం, ఈడీలకు సమర్పిస్తానని తెలిపారు. నిజాలు వెల్లడించినందుకు ప్రజలందరూ తనని భిమానిస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కోలా వెల్లడించిన బ్యాంక్ ఖాతాల వివరాలు:
1. నారావారిపల్లెకు చెందిన నారా గణేష్ బాబు, అపర్షియా బ్యాంక్, మారిషస్ ఖాతా నెంబరు: 65293650745655
2. నారావారి పల్లెకు చెందిన నారా రజనీ, ఇండియన్ ఓసియన్ ఇంటర్నేషనల్ బ్యాంక్, మారిషస్. ఖాతా నెంబరు: 88865928682567 3. నారా రజనీ పేరిట మరో ఖాతా ఉంది. బ్యాంక్ ఒన్ మారిషస్ ఖాతా నెంబరు: 7348681609334
4. నారావారిపల్లెకు చెందిన ఎ.ముణిరత్నం నాయుడు, బ్రమేర్ బ్యాంకింగ్ కార్పొరేషన్, మారిషస్. ఖాతా నెంబరు:33492486101485
5. నారావారిపల్లెకు చెందిన నారా దశరథరామయ్య, బ్రమేర్ బ్యాంకింగ్ కార్పొరేషన్, మారిషస్.ఖాతా నెంబరు: 33492486101488
6. నారా గణేష్ బాబు, నారా గోవిందరాజులు - బ్యాంక్ ఒన్ మారిషస్,ఖాతా నెంబరు: 7348681609333
7. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబరు 10కి చెందిన చదలవాడ భాస్కరరావు, బ్యాంక్ ఒన్ మారిషస్.ఖాతా నెంబరు: 7348681609325
8. చదలవాడ ఝాన్సీలక్ష్మి - బ్యాంక్ ఒన్ మారిషస్,ఖాతా నెంబరు: 7348681609327
9. చదలవాడ యామిని- బ్యాంక్ ఒన్ మారిషస్.ఖాతా నెంబరు:7348681609326
10. పులగారిపల్లెకు చెందిన కంభంపాటి సురేష్ కుమార్,బ్యాంక్ ఒన్ మారిషస్. ఖాతా నెంబరు: 73488816093214
|