NEWS

Blogger Widgets

19.6.12

అమెరికాదే సూపర్ కంప్యూటర్


అమెరికా ప్రభుత్వ అవసరాల కోసం ఐబీఎం రూపొందించిన సెకోయా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ హోదాను దక్కించుకుంది.
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ అవసరాల కోసం ఐబీఎం రూపొందించిన సెకోయా .. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ హోదాను దక్కించుకుంది. ఇప్పటిదాకా జపాన్‌కి చెందిన ఫ్యూజిత్సు రూపొందించిన ‘కె కంప్యూటర్’ ఈ స్థానంలో ఉండేది. తాజా పరిణామంతో మరోసారి అమెరికా కంప్యూటర్‌కి సూపర్ కంప్యూటర్ హోదా దక్కినట్లయింది. సెకోయా 16.35 పెటా ఫ్లాప్స్ (ఒక్క పెటాఫ్లాప్ అంటే... సెకనుకు వెయ్యి ట్రిలియన్ల మేర లెక్కించగలగడం) సామర్థ్యంతో పనిచేస్తుంది.