బీజింగ్: మానవ సహిత వ్యోమనౌకను అంతరిక్షానికి పంపడంలో చైనా విజయవంతమైంది. దేశంలోని తొలి మహిళా వ్యోమగామి సహా ముగ్గురు వ్యోమగాములు షెన్‌ర-9 వ్యోమనౌకలో సోమవారం అంతరిక్షానికి చేరుకున్నారు. చరిత్రాత్మకమైన ఈ ఘట్టాన్ని చైనా టీవీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. షెన్‌ర-9 వ్యోమనౌక ద్వారా ఈ ముగ్గురు వ్యోమగాములూ అంతరిక్ష కక్ష్యలో ఉన్న టియాన్‌గాంగ్-1 అంతరిక్ష ప్రయోగశాలలోకి అడుగుపెట్టారు. ఈ ప్రయోగశాలను చైనా గత ఏడాదిలోనే అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రష్యా నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తరహాలోనే అంతరిక్షంలో ఒక ప్రయోగశాలను స్థాపించాలన్న ప్రయత్నాల్లో భాగంగానే చైనా ఈ ప్రయోగం చేపట్టింది.