మెదక్: జహీరాబాద్ మండలం దిడ్గిగ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్తున్న టవేరా వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతులంతా హైదరాబాద్ పురానాహవేలికి చెందినవారుగా గుర్తించారు. వారు పెళ్లిచూపుల కోసం బీదర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
|