న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో రాష్ట్రం విడిపోయేందుకు బలమైన సంకేతాలు ఇచ్చినట్టైందని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేశ్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే తెలంగాణ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇది తమకు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలపై అధిష్టానం పెద్దలను కలిసేందుకు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి ఢిల్లీ వచ్చిన టీజీ సోమవారం సాయంత్రం ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పరకాలలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
|