NEWS

Blogger Widgets

17.6.12

నెత్తురోడిన పాక్ - బాంబు పేలి 25 మంది దుర్మరణం





ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. ఖైబర్ గిరిజన ప్రాంతంలో రద్దీగా ఉండే మార్కెట్ వద్ద శక్తిమంతమైన బాంబు విస్ఫోటనం చెంది 25 మంది ప్రాణాలు కోల్పోగా మరో 60 మంది గాయపడ్డారు. లాందీ కోట్లా పట్టణంలోని మార్కెట్ వద్ద శనివారం ఈ దుర్ఘటన జరిగింది. మార్కెట్ వద్ద నిలిపిన ట్రక్కులో అమర్చిన బాంబును దుండగులు పేల్చివేశారని అధికారులు తెలిపారు. ప్రభుత్వానుకూల జక ఖేల్ గిరిజన తెగ వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్టు చెప్పారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఏ సంస్థా ప్రకటించలేదన్నారు. ఇదిలా ఉండగా, పెషావర్‌లోని కోహట్ ప్రాంతంలో రోడ్డు పక్కన అమర్చిన బాంబును అధికారులు నిర్వీర్యం చేశారు. దుండగులు ప్రెషర్ కుక్కర్‌లో ఆ బాంబును అమర్చారని వారు తెలిపారు