అతన్ని వదలరాదని కేంద్రానికి భార్య వినతి
బెంగళూరు, న్యూస్‌లైన్: బెంగళూరులోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో దౌత్యాధికారిగా పనిచేస్తున్న పాస్కల్ మజూరియర్ అనే ఫ్రెంచ్ జాతీయుడు కన్న కూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల కూతురిపై గతకొంతకాలంగా అత్యాచారం సాగిస్తున్నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై నిందితుడి భార్య సుజా జోన్స్ మజూరియర్ ఫిర్యాదు మేరకు ఇక్కడి హైగ్రౌండ్స్ పోలీస్‌స్టేషన్ అధికారులు శుక్రవారం పాస్కల్‌ను అదుపులోకి తీసుకుని, బౌరింగ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. పాపకు పరీక్షలు నిర్వహించిన బాప్టిస్ట్ ఆస్పత్రి వర్గాలు కూడా పాస్కల్‌పై మెడికో-లీగల్ కేసును నమోదు చేశాయి. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది.
నిమ్హాన్స్ వైద్యులు కూడా బిడ్డపై అత్యాచారం, దౌర్జన్యం జరిగిందని తేల్చారు. అయితే దౌత్య ఒత్తిళ్ల కారణంగా అతన్ని తిరిగి విడిచిపెట్టారు. కానీ సుజా మాత్రం ఈ వ్యవహారంలో తన భర్తను దౌత్య సంబంధాల పేరిట విచారణ నుంచి మినహాయించవద్దని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు హోంమంత్రి చిదంబరం, విదేశాంగ మంత్రి ఎస్‌ఎం. కృష్ణకు శనివారం లేఖ రాశారు. కేసుకు సంబంధించి చట్టబద్ధ లాంఛనాలు పూర్తయ్యే వరకు ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూడాలని కోరారు. తమ పిల్లలు ఫ్రెంచ్ జాతీయులైనప్పటికీ, వారిని ఆయనకు అప్పగించరాదన్నారు. సుజా తరఫున లేఖలు రాసిన ఆమె న్యాయవాది బసు, తన క్లయింట్‌కు, ఆమె పిల్లలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేరళకు చెందిన సుజా ఇక్కడి వసంత నగరలోని ఫ్రాన్స్ రాయబార కార్యాల యంలో డిప్యూటీ హెడ్‌గా పని చేస్తున్న మజూరి యర్ (39)ను 2001లో ఫ్రాన్స్‌లో పెళ్లి చేసుకున్నారు. వారికి 2005లో బాబు పుట్టగా, 2008లో పాప , 2010లో మరో బాబు పుట్టారు.
|