NEWS

Blogger Widgets

17.6.12

మీరు తగ్గిస్తే.. మేమూ తగ్గిస్తాం--- పెట్రోలు పన్నులపై రాష్ట్రాలకు ప్రణబ్ సూచన


ముంబై: వినియోగదారులపై భారం తగ్గించేందుకు రాష్ట్రాలు పెట్రోలుపై పన్నులు తగ్గిస్తే.. కేంద్ర ప్రభుత్వం కూడా తాత్కాలికంగా సుంకాలను తగ్గించేం దుకు సుముఖంగా ఉందని ఆర్థికమంత్రి ప్రణబ్ ము ఖర్జీ వ్యాఖ్యానించారు. శనివారం అసోచామ్ నిర్వహించిన ఓ సదస్సులో ప్రణబ్ మాట్లాడారు. ‘‘నేను ఇప్పటికే ముఖ్యమంత్రులను కోరాను. బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్ల దాకా తగ్గే వరకు పన్నులు తగ్గించాలని సూచించా. రాష్ట్రాలు పన్నులు తగ్గిస్తే మేం కూడా సుంకాలు తగ్గిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. పెట్రోలు ధరలో సగం వరకు కేంద్రం, రాష్ట్రాలు విధించే పన్నులు ఉంటున్న సంగతిని ప్రణబ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘పెట్రోలుపై పన్నుల రూపేణా కేంద్ర, రాష్ట్రాలకు రాబడి బాగానే వస్తున్నా.. క్లిష్ట సమయాల్లో భాగస్వామ్యపక్షాలన్నీ కష్టాలను పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కష్టాలను ఏ ఒక్క భాగస్వామిపైనో నెట్టివేయలేం’’ అని చెప్పారు. కిందటి నెలలో ఆయిల్ కంపెనీలు లీటరు పెట్రోలుపై ఏకంగా రూ.7.54 పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 3న రూ.2 తగ్గించి కాస్త ఊరట కల్పించాయి. జూన్ 14 నాటికి బ్యారెల్ ముడి చమురు ధర 95.97 డాలర్లకు పడిపోయినందున ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.