బెంగళూరు, న్యూస్‌లైన్:
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయులు విజయేంద్ర, రాఘవేంద్ర, అల్లుడు సోహన్ కుమార్‌లు శనివారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అక్రమ మైనింగ్ కేసును విచారిస్తున్న సీబీఐ, వీరిని విడివిడిగా మూడు గంటలపాటు ప్రశ్నించింది. సీబీఐ అధికారులు ఈ ముగ్గురికీ వేరువేరు సమయాలను కేటాయించారు. దీంతో వారు విడివిడిగా వారికి కేటాయించిన సమయాల్లో స్థానిక గంగానగరలోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. అయితే, విచారణ అనంతరం ముగ్గురూ కలిసే వెళ్లారు. వీరు నిర్వహిస్తున్న ‘ప్రేరణ’ ట్రస్టుకు ఓ మైనింగ్ కంపెనీ నుంచి రూ.20 కోట్ల విరాళాలు అందడంపై సీబీఐ వీరిని ప్రశ్నించింది