NEWS

Blogger Widgets

17.6.12

అది అసత్య ప్రచారం


ఇటీవల లండన్ హోటల్‌లో లక్ష్మీరాయ్ నానా రగడ సృష్టించిందనేది వివాదం.
ఏదో సంఘటనతో ఎప్పుడు వార్త్తల్లో కెక్కే నటి లక్ష్మీరాయ్. తాజాగా ఆమెపై మరో వివాదం తెరపైకొచ్చింది. ఇటీవల లండన్ హోటల్‌లో లక్ష్మీరాయ్ నానా రగడ సృష్టించిందనేది వివాదం. దీనికి తాండవం చిత్ర షూటింగ్ కోసం లండన్ వెళ్లిన ఈ జాణ తనకు విలాసవంతమైన హోటల్‌లో బసకు ఏర్పాటు చేయలేదని గొడవ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీని గురించి నటి లక్ష్మీరాయ్ వివరణ ఇస్తూ తాను ఏ హోటల్‌లోనూ రగడ సృష్టించలేదని స్పష్టం చేసింది.

నటిగా ఒక ప్రముఖ స్థానంలో ఉన్న తాను అలా ఎలా ప్రవర్తిస్తానని ప్రశ్నించింది. అసలు జరిగిందేమిటంటే తన కోసం బుక్ చేసిన హోటల్‌కు వెళ్లానని చెప్పింది. అక్కడ తన కోసం కేటాయించిన రూమ్ ఖాళీ లేదని, వేరే వారు బస చేసి ఉన్నారని హోటల్ నిర్వాహకులు చెప్పారని అంది. తన కోసం బుక్ చేసిన రూమ్‌ను వేరే వాళ్లకు ఎలా కేటాయిస్తారని నిలదీశానని పేర్కొంది. తనకు రూమ్ ఇచ్చే వరకు రిసెప్షన్ హాల్‌లోనే వేచి ఉన్నానని చెప్పింది. అయినా వాళ్లు తనకు రూమ్ కేటాయించకపోవడంతో యూనిట్ వర్గాలు వేరే హోటల్‌లో రూమ్ ఇచ్చారని తెలిపింది. తాను మరుమాట చెప్పకుండా ఆ హోటల్‌కు వెళ్లిపోయానని వివరించింది.