తనను లైంగికంగా వేధించిన వారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడు కూడా ఉన్నారని వ్యభిచారం కేసులో పట్టుబడిన ఇటీవల బెయిలుపై విడుదలైన సహాయ నటి తారా చౌదరి ఆరోపించారు. ఆమె ఆదివారం ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ... తన కేసులో అనేక మంది పెద్దలు ఉన్నారన్నారు.
పోలీసులతో పాటు బడా నేతలు కావాలనే తనను వ్యభిచారం కేసులో ఇరికించారని ఆరోపించారు. వీరందరి బాగోతాన్ని త్వరలోనే బయటపెడతానని చెప్పారు. జైలు నుంచి బయటకు వెళ్లాక వాస్తవాలు వెల్లడిస్తే తన నగ్న దృశ్యాలు బయటపెడతామని పోలీసులు బెదిరించారిస్తున్నారని తారా వాపోయింది.
రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు అర్థరాత్రులు ఫోన్ చేసి వేధించేవారని, బూతు ఎస్ఎంఎస్‌లు కూడా పంపేవారని తెలిపింది. వీరిలో టీడీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని వెల్లడించింది. తనకు ప్రాణహాని ఉన్నా పెద్దల బాగోతం బయటపెడతానని తారా చౌదరి ప్రకటించింది.