NEWS

Blogger Widgets

15.6.12

‘స్విస్’లో పెరిగిన భారతీయుల సంపద!



  • 15/06/2012
న్యూఢిల్లీ, జూన్ 14: విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కితీసుకురావాలని ఓ వైపు జాతీయ స్థాయిలో ఉద్యమాలు జరుగుతుంటే, మరోవైపు స్విస్ బ్యాంకులో భారతీయుల సంపద నిల్వ గత ఐదేళ్లలో తొలిసారిగా పెరిగింది. స్విస్ నేషనల్ బ్యాంక్ తాజాగా ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం గత ఐదేళ్లలో తొలిసారిగా భారతీయుల సంపద విలువ 2.18 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ అంటే రూ.12,740కోట్లకు చేరుకుంది. స్విస్ బ్యాంక్ అధికారుల వివరాల ప్రకారం - జమచేయబడిన నిధుల్లో భారత్‌లోని ఖాతాదారుల నుంచి నేరుగా వచ్చినవేకాక, నల్లధనం కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే భారతీయులు గాని, మరే ఇతర దేశస్థులు కాని దాచుకున్న నల్లధనాన్ని లెక్కల్లోకి తీసుకోలేదు. కాని 20 నుంచి 25 బిలియన్ల డాలర్లు ఉండవచ్చని అంచనా వేశారు. అయితే భారతీయులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న ధనం 2006 నాటికి 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (40వేల కోట్ల రూపాయలు) కాగా, అది 2010 నాటికి 33శాతం పడిపోయి, మళ్లీ 2011లో 3,500కోట్ల రూపాయలు పెరిగింది. భారత ప్రభుత్వం వివరించిన లెక్కల్లో కూడా స్విస్ బ్యాంకుల్లో జమ అయిన నిధులు 2006-2010 మధ్య కాలంలో 14వేల కోట్లకు పైగా క్షీణించినట్లు తెలిపింది. 2006లో స్విస్ బ్యాంకు ఖాతాల్లో 23,373కోట్ల నిధులుండగా, అది 2010 నాటికి 9,295కోట్లకు పడిపోయింది

.