NEWS

Blogger Widgets

15.6.12

వైయస్ జగన్ పార్టీ లీడ్‌లో ఉన్న స్థానాలు ఇవే


శుక్రవారం, జూన్ 15, 2012, 10:30 [IST]

 Bypolls Seats Leading Ysrcp
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో ఉన్న స్థానాలు - నర్సన్నపేట, పాయకరావుపేట, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, అనంతపురం అర్బన్, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు, రామచంద్రాపురంలో కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు ఆధిక్యంలో ఉన్నారు. పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యంలో కొనసాగుతోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెసు రెండు స్థానాల్లో, టిడిపి ఒక స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. తొలుత రామచంద్రాపురంలో ఆధిక్యంలో కొనసాగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ తర్వాత కాంగ్రెసుపై వెనకబడిపోయింది.
రామచంద్రాపురం, తిరుపతి, ఉదయగిరి వంటి స్థానాల్లో కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాంగ్రెసు గట్టి పోటీ ఇస్తోంది. రామచంద్రాపురంలో కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణకు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొని ఉంది.
తెలంగాణలోని పరకాల శాసనసభా నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. తెరాసకు సవాల్ విసిరి బరిలోకి దిగిన బిజెపి నాలుగో స్థానంలో ఉంది.
నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డిపై 11 వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఉదయగిరి శాసనసభా స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి కేవలం 405 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. నర్సాపురం, తిరుపతి స్థానాల్లో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతుంది.
ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెసు పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే, తిరుపతిలో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణ మధ్య పోరు హోరాహోరీగా ఉంది.
కాగా, పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి బిక్షపతి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలోకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వచ్చింది. చాలా చోట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్యనే పోరు కొనసాగుతోంది. ఆళ్లగడ్డలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభానాగి రెడ్డి ఆధిక్యంలో ఉంది. రాయదుర్గంలో కూడా వైయస్సార్ కాంగ్రెసు ఆధిక్యంలో ఉంది. నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.