ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్‌ను రాష్ట్రపతిగా ఎన్నుకోవాలనే ప్రతిపాదనను ఎలా అంగీకరిస్తామని కాంగ్రెస్ మీడియా విభాగం ఛైర్మన్ ద్వివేదీ ప్రశ్నించారు. మన్మోహన్ 2014 వరకు ప్రధానిగా కొనసాగుతారని స్పష్టం చేశారు.
సంకీర్ణ ప్రభుత్వం నాయకుడిని మధ్యలో మార్చుకునే ప్రసక్తే లేదన్నారు. మిత్రపక్షాలైన టిఎంసి, ఎస్పీలు రాష్టప్రతి పదవికి ప్రతిపాదించిన మన్మోహన్, మాజీ రాష్టప్రతి ఏపిజె అబ్దుల్ కలాం, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ అభ్యర్థిత్వాలను ఖరాఖండీగా తిరస్కరించినట్లు వెల్లడించారు.
రాష్టప్రతి పదవికి అందరూ ఆమోదించే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చర్చల ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు ద్వివేది తెలిపారు.