15/06/2012
TAGS:
హైదరాబాద్, జూన్ 14: వివాదాస్పద వాన్‌పిక్‌పై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ ప్రాజెక్టుపై ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే సంభవించే పరిణామాలు, కొనసాగితే నెలకొనే పరిస్థితులపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. అటు అధికారులతో, ఇటు అడ్వకేట్ జనరల్‌తో విస్తృతంగా మంతనాలు సాగిస్తున్నప్పటికీ కసరత్తు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వీలయినంత త్వరలో వాన్‌పిక్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంబంధిత శాఖలను ఆదేశించినప్పటికీ ఇంకా తర్జనభర్జన కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వివాదం బంతిని అడ్వకేట్ జనరల్ కోర్టులోకి పంపించిన అధికారులు అక్కడి నుంచి వచ్చే సలహా కోసం వేచి చూస్తున్నారు.
రాక్ ఆల్‌ఖైమా దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వాడరేవు, నిజాంపట్నం ఓడ రేవుల అభివృద్ధి కోసం వాన్‌పిక్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మధ్యలో రాక్ సంస్థ మాట్రిక్స్ సంస్థతో అంతర్గత ఒప్పందం కుదుర్చుకోవడం, వాటాలపై కీలక నిర్ణయాలు తీసుకోవడం, పనుల నిర్వహణ వంటి అంశాలు, భూసేకరణ అంశాలు వివాదాస్పదమయ్యాయి. భూ సేకరణలో భారీగా అక్రమాలు జరిగాయన్నది కూడా వెలుగు చూడడంతో సిబిఐ విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగానే అప్పట్లో పెట్టుబడులు, వౌళిక సౌకర్యాల శాఖ మంత్రిగా పనిచేసిన మోపిదేవి వెంకటరమణను కూడా సిబిఐ అరెస్టు చేసింది.
ఈ నేపథ్యంలోనే వాన్‌పిక్ ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు ప్రభుత్వం ఆలోచన ప్రారంభించింది. నేరుగా రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తే వచ్చే సమస్యలపై ఏ నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండడంతో అన్ని కోణాల్లో న్యాయ సలహాలను కూడా తీసుకుంటోంది.
ప్రధానంగా ఈ ఒప్పందంలో రెండు సంస్థలు ఉండడంతో ఏలాంటి నిర్ణయం తీసుకోవాలన్న కోణంలోనే ప్రధానంగా ఆలోచన చేస్తోంది. ఆరోపణలకు గురైన మాట్రిక్స్‌పై చర్యలు తీసుకుంటూ నేరుగా రాక్ సంస్థకు అనుమతి కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇదే సమయంలో మొత్తం వాన్‌పిక్‌ను రద్దు చేస్తే సంభవించే పరిణామాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేస్తే రెండు దేశాల మధ్య విబేధాలు తలెత్తే పరిస్థితి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇది న్యాయపరమైన చిక్కులకు కూడా అవకాశం కల్పిస్తుందని వారు అంటున్నారు. అందుకే ఈ విషయంలో ఆచితూచి అడుగు ముందుకు వేయాలని భావిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.
ఆలాగే నేరుగా వాన్‌పిక్‌కు అనుమతులను రద్దు చేసుకుంటే సిబిఐ కేసులో కూడా సమస్యలు రావచ్చునన్న భావాన్ని మరికొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిబిఐ కేసు దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే కేసు విచారణ బలహీనపడే అవకాశాలు ఉంటాయని, అది ప్రభుత్వంపై కూడా ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. ఇక రద్దు అంశాన్ని పక్కకు పెడితే అక్రమాలు జరిగిన సంస్థపై కూడా చర్యలు తీసుకోవడం లేదన్న అపప్రధను ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇలా వాన్‌పిక్‌పై నిర్ణయం తీసుకునేందుకు అనేక కోణాల్లో ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు ఉండడంతో ఏమిచేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.