NEWS

Blogger Widgets

15.6.12

ఉత్కంఠ పోరులో పరకాలలో కొండా సురేఖ ఓటమి!

konda surekha
File
FILE
వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోరు తెలంగాణ వాదాన్ని నమ్ముకుని రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ముచ్చెమట పోయించింది. ఈ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ టీఆర్ఎస్ దూకుకుడు బ్రేకుల్ వేయించారు. ఒక దశలో టీఆర్ఎస్ అభ్యర్థికి వేలల్లో ఉన్న మెజార్టీని కొండా సురేఖ పూర్తిగా తగ్గించిన 151 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించుకున్నారు. అయితే, 17వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి మళ్లీ పుంజుకుని 556 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్లారు. 

రాష్ట్రంలో జరిగిన 18 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పరకాల స్థానం ఒకటి. ఈ స్థానం ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా.. టీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని నమ్ముకుని బరిలోకి దిగగా, కొండా సురేఖ మాత్రం తన వ్యక్తిగత బలంతో పాటు.. జగన్, వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను నమ్ముకుని బరిలోకి దిగారు. 

ఈ ఓట్ల లెక్కింపులో 12వ రౌండ్ వరకు తెరాస అభ్యర్థి ఐదు వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అయితే, 13, 14, 15 రౌండ్లలో కొండా సురేఖ దూకుడు ప్రదర్శించి ఆధిక్యాన్ని కూడబెట్టుకున్నారు. ఒక దశలో కేవలం టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీని 120 ఓట్లకు తగ్గించారు. ఆ తర్వాత 16, 17, 18 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి పుంజుకుని 556 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

చివరి 19వ రౌండ్‌లో 4300 ఓట్లు ఉండగా, ఈ రౌండ్‌లో కూడా తెరాస అభ్యర్థి భిక్షపతి ఆధిక్యం సాధించడంతో పరకాల టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. మొత్తమ్మీద కొండా సురేఖ టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు ముచ్చెమటలు పోయించారని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి 800 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.